ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ రకరకాల లోకేషన్లలో, డిఫెరెంట్ కాన్సెప్ట్‌లతో ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పెళ్లి కూతురు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా..
తమిళనాడుకు చెందిన ఓ యువతి ప్రీ వెడ్డింగ్ షూట్ కాస్తా కొత్తగా ఉండాలని ఏకంగా పెళ్లి కూతురి గెటప్‌లోనే జిమ్‌లో బరువులెత్తుతూ ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సంయుక్త అనే మరో యువతి తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోకు భర్త, అత్తింటివారికి ఇదో స్ట్రాంగ్ హెచ్చరిక అని సరదాగా వ్యాఖ్యలు చేర్చింది. ఇక నెటిజన్లు అయితే అత్తింటివారి పనైపోయింది. ఇకపై వారికి చుక్కలు చూస్తారు అని కామెంట్లు చేస్తున్నారు.