మీరు ఎక్కువగా రైల్వేలో ప్రయాణిస్తున్నారా..?. మీకు రైల్ లో ప్రయాణించకపోతే అసలు జర్నీ చేసినట్లే ఉండదా..?. తరచుగా రైల్ టికెట్లను బుక్ చేసుకుని మరి కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకుంటున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే .
రైల్వే టికెట్ ,హోటల్ గది బుకింగ్ రద్దు చేసుకుంటే ఇప్పటికే అమలుల్లో ఉన్న క్యాన్సిలేషన్ చార్జీలతో పాటు ఇక నుండి వస్తు సేవల పన్ను అదే అండి జీఎస్టీ రూపంలో కూడా కొంత మొత్తాన్ని వసూలు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక వ్యవహారాల ట్యాక్స్ రీసెర్చ్ యూనిట్ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇక మీదట టికెట్ క్యాన్సిలేషన్ మరీ ఖరీదు కానున్నది అన్నమాట .. ఉన్నమాట. ఇక నుండి రైల్వేలో ప్రయాణం చేయాలన్నా ఖర్చే.. ఆ టికెట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలన్నా ఖర్చే అన్నమాట.