తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ గెలిస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..?. ఒక్క ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన మిత్రపక్షం ఎంఐఎంతో కల్సి 109 స్థానాలున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి కేవలం మూడంటే మూడు స్థానాలకు మరోక స్థానం యాడ్ అయితే నాలుగు సీట్లతో బీజేపీ సర్కారు ఏర్పాటు అవుతుందా..?.
ఎందుకంటే ఇటీవల మునుగోడులో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభకు విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నెల రోజుల్లోపే టీఆర్ఎస్ సర్కారు పడిపోతుందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు.
తాజాగా మునుగోడు నియోజకవర్గంలో సంస్థాన్ నారాయణపురం లో జరిగిన బీజేపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నెల రోజుల్లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించాడు. అయితే పైన చెప్పినట్లు అంత బలం ఉన్న టీఆర్ఎస్ ను కాదని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా మీరే కామెంట్ల రూపంలో చెప్పండి.