5జీ సర్వీసులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి నాటికి దేశంలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలు స్టార్ట్ చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఏజీఎం మీటింగ్ ముకేష్ అంబానీ మాట్లాడారు. తొలుత ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ప్రతి నెలా ఈ సర్వీసులను విస్తరించుకుంటూ వెళ్తామని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి మండలం, ప్రతి పట్టణంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని అంబానీ వివరించారు. దీనికోసం మొత్తం రూ.2లక్షల కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.
ఏజీఎం మీటింగ్ సందర్భంగా ముకేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే వారసులను ప్రకటించారు. జియో బాధ్యతలను ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్, రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను అనంత్ అంబానీకి అప్పగిస్తున్నట్లు ముకేష్ తెలిపారు.