గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ కరోనా పాజీటివ్ కేసుల నమోదు సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి.
ఇందులో 4,37,83,788 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,597 మంది మరణించారు. మరో 87,311 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 12,875 మంది కరోనా నుంచి బయటపడగా, 41 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.