హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు.
శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్‌కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి జీవితంలో వర్క్ ఫ్రం హోం వల్ల కలతలు వచ్చాయి. భార్యకు పల్లెటూరులో ఉండటం ఇష్టం లేక సిటీకి వెళ్దామని భర్తతో చెప్పగా వర్క్ ఫ్రం హోం పూర్తయితే వెళ్దామని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగి నిహారిక పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తామామలు కూడా సూటిపోటి మాటలతో రాకేశ్‌ను బాధ పెట్టేవారు. 5 నెలల గర్భిణిగా ఉన్న నిహారిక ఇటీవల భర్తకు వీడియోకాల్ చేసి నువ్వు చనిపోతే హ్యాపీగా ఉంటానని, వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన రాకేశ్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో పోలీసులు భార్యతో పాటు అత్తమామలపై కేసు నమోదు చేశారు.