ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్‌ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు.
దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.