సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి నటుడిగా నిలదొక్కుకోవడం తనకు చాలా పెద్ద విషయమని హీరో నిఖిల్ అన్నాడు. ఇటీవల కార్తికేయ-2 సక్సెస్‌ను అందుకున్న ఈ హీరో ఓ ఆంగ్ల పత్రికతో మనసులోని మాటలు పంచుకున్నాడు. తన సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.
ఇండస్ట్రీలో తనకు ఓ గాడ్‌ఫాదర్ ఉండుంటే కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని ఇబ్బందులు పడే వాడికి కాదని అన్నాడు నిఖిల్. ఇండస్ట్రీ అంటేనే ఒక రోలర్ కోస్టర్ అని, ఇందులోకి రావాలని ఆశపడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకవిధంగా ఎత్తుపల్లాలు చూడాల్సి వస్తుందని తెలపాడు. సినిమాల విషయంలోనూ, కథల ఎంపికలోనూ తనకు ఎవరూ సపోర్ట్ ఇచ్చేవారు లేరని నిఖిల్ బాధపడ్డాడు. హ్యాపీడేస్ తర్వాత వరస 6 సినిమాలు చేసినప్పటికి ఏదీ హిట్ కాలేదు. స్వామి రారా సినిమాలో ఆరేళ్ల తర్వాత విజయం అందుకున్న ఈ హీరోకు కథే అన్నింటికంటే ముఖ్యమని అప్పడు అర్థమైందని చెప్పాడు. ఓ మూవీ ప్రేక్షకులకు నచ్చాలి అంటే స్టోరీ చాలా ముఖ్యమని అప్పుడే సక్సెస్ వస్తుందని తెలిపాడు నిఖిల్.