కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఆశ వర్కర్లు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా తమకు ఇండ్లు, మెట్రో పాస్ లు, హెల్త్ కార్డులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు లలిత తదితరులు పాల్గొన్నారు.