పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.
