కర్ణాటకలో గురువారం ఉదయం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. లారీ జీపును ఓవర్ టేక్ చేయడం వల్లే ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు రాయచూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా సమయంలో జీపులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు, 2 చిన్నారులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Tags crime jeep accident karnataka karnataka accident lorry accident rayachure road accident road accident in karnataka spotdead