ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ దిగజారింది. ఇప్పుడు రాజాసింగ్ అంతకంటే ఒక అడుగు ముందుకు వేశారు అని ఆయన దుయ్యపట్టారు.