తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల్లో 10 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వీరిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, నారాయణరెడ్డి, ప్రకాశ్, కడియం, కోటిరెడ్డి, సత్యవతిరాథోడ్, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీల్లో యెగ్గె మల్లేశం(రూ.126.83 కోట్లు) తొలిస్థానంలో, కవిత (రూ. 39.79 కోట్లు) 4వ స్థానంలో నిలిచారు. అత్యధిక అప్పులున్న వారిలో కవిత(రూ.21.62 కోట్లు) 2వ ప్లేస్లో ఉన్నారు.
