డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో ఏకంగా రూ.10 కోట్ల చదివింపులు వచ్చాయి. చదివింపుల కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేయించారు ఆ ఎమ్మెల్యే.
పుదుకోట్టై, తంజావూరు మొదలైన జిల్లాల్లో వందేళ్లగా చదివింపుల విందు వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకేకు చెందిన పేరావూరణి నియోజికవర్గ ఎమ్మెల్యే అశోక్‌కుమారు తమ మనవడి చెవులు కుట్టే ఫంక్షన్, చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకు వెజ్, నాన్ వెజ్ విందు పెట్టారు.
ఫైనాన్సియల్‌గా ఇబ్బందుల్లో ఉన్న వారు ఎవరి దగ్గర చేయిచాచకుండా తమ స్థాయిని బట్టి ఇలా విందు ఏర్పాటు చేసి చదివింపుల కార్యక్రమం నిర్వహిస్తారు. వీటి ద్వారా వచ్చే డబ్బుతో ఆర్థిక స్థితి మెరుగుపరుచుకుంటారు. అయితే ఒకసారి ఈ విందు ఏర్పాటు చేస్తే మళ్లీ 5 ఏళ్ల వరకు నిర్వహించకూడదని అక్కడి రూల్.