ప్రముఖ యాంకర్, నటి అనసూయ లేటెస్ట్‌గా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరినో తెలియదు కానీ.. వాళ్లని ఉద్దేశించి చేసిన కౌంటర్ ట్వీట్‌లాగే అది ఉంది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను.. కానీ నమ్మకం నిజమైంది’ అనే అర్థం వచ్చేలా చేసిన ట్వీట్‌పై సినీ ప్రియుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో సినీ పరిశ్రమకే చెందిన కొందరు ఆమెను కామెంట్ చేశారని.. అందుకే అనసూయ వారి పేరు ప్రస్తావించకుండా ఇలా కౌంటర్ ఇచ్చారని చెప్పుకొంటున్నారు.