తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.
