తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజశేఖర్ హీరోగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ మీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. పవన్ సాదినేని దర్శకుడు. ఈ మూవీకి ‘మాన్స్టర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్లో షూటింగ్ లాంఛనంగా మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రవీణ్ సత్తారు క్లాప్ నిచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని డైరెక్టర్ పవన్ సాధినేని తెలిపాడు.
