సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి ఓ కేసులో తమిళనాడులోని చెన్నై న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అసలు విషయానికోస్తే దర్శకుడిగా లింగుస్వామి దర్శకత్వ బాధ్యతలే కాకుండా తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ పతాకంపై పలు సినిమాలను నిర్మించే బాధ్యతలు కూడా నిర్వహిస్తుంటాడు.
అయితే కొన్నేళ్ల క్రిందట కార్తీ.. హాటేస్ట్ హీరోయిన్ సమంత జంటగా లింగుస్వామి ,ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. దీనికి సంబంధించి పీవీపీ సినిమాస్ సంస్థ నుండి కొంతమొత్తం అప్పు తీసుకున్నారు.
కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందు పడలేదు. కానీ పీవీపీ దగ్గర తీసుకున్న మొత్తాన్ని చెక్కుల రూపంలో లింగుస్వామి చెల్లించారు. అది కాస్త బౌన్స్ కావడంతో పీవీపీ సినిమాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సోమవారం విచారించి లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.