దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 8,586 కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది వైరస్ మరణించారు. మరో 10,677 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 210.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
