బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ కు కోపం వచ్చింది. ఎందుకంటే గత కొన్ని రోజులకు హిందీ చిత్ర పరిశ్రమను పలు ఇబ్బందులకు గురి చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై అక్కడి తారలు ధీటుగానే స్పందిస్తున్నారు.
సినిమా అనేది ప్రేక్షకులకు ఒక అప్షన్ మాత్రమే .కంపల్సరీ కాదు అని చెప్పేశారు. ఈ ట్రెండ్ ప్రారంభమైన మొదట్లో అక్షయ్ కుమార్.. అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ ఇలాంటి పిలుపులు సరి కాదు అని సవినయంగా చేప్పే ప్రయత్నం చేశారు. అర్జున్ కపూర్ లాంటి మరికొందరు హీరోలు ఇలాంటివి సహించకూడదని తమ అగ్రహాం వ్యక్తం చేశారు.
త్వరలో విడుదల కానున్న మరో భారీ చిత్రం బ్రహ్మాస్త్రం కు ఇప్పటి నుంచే బాయ్ కాట్ బ్రహ్మాస్త్రం అని కొందరూ ప్రచారం చేస్తున్నారు. మీకు మేము నచ్చితే చూడండి.. లేకపోతే లేదు అంటూ ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.