పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్లో ఇదే అధిక రేటు అని చెబుతున్నారు.