టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌కు ఇలా అవ్వడంతో భారత జట్టు ఆందోళన చెందుతోంది. యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలో వచ్చే ఆదివారమే ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యూఏఈ వెళ్లేందుకు నిర్వహించే పరీక్షల్లో రాహుల్ ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే ఆ మ్యాచ్ సమయానికి ద్రవిడ్ కోలుకుని యూఏఈ వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.