Home / EDITORIAL / మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?

మునుగోడు సమర భేరీ సభ సాక్షిగా బీజేపీ సెల్ఫ్ గోల్.. ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయం..?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మునుగోడులో జరిగిన  బీజేపీ సమరభేరీ భారీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేరింది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. కేవలం స్వలాభం కోసం మాత్రమే ఆయన కాంగ్రెస్ పార్టీను వీడి బీజేపీలో చేరారు అని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న ప్రధాన విమర్శ. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఇతనికంటే ముందు దుబ్బాకలో గెలుపొందిన మాధవనేని రఘునందన్ రావు వలన ఎంతవరకు అభివృద్ధి చెందింది.. కేంద్రం నుండి ప్రత్యేక నిధులు తీసుకోస్తా అని ప్రజల ముందుకెళ్ళి మరి ఓట్లేయించుకుని గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చాడు.వీటిన్నింటికి సమాధానం లేని ప్రశ్నలు. అయితే మునుగోడు సభ సాక్షిగా తాము గెలుస్తాం. రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడని అమిత్ షా తో అందరూ గప్పాలు కొట్టారు… ఆ తర్వాత ఎవరికి వారు ఫ్యాకప్ అయ్యారు. అయితే నిజంగా రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడా.. గెలిస్తే ఎలా గెలుస్తాడు.. ఓడిపోతే ఎలా ఓడిపోతాడు.. మునుగోడు సభ సాక్షిగా బీజేపీనే సెల్ఫ్ గోల్ వేసుకుందా.. ఇప్పుడు చర్చించుదాం..

మునుగోడులో బీజేపీ నిర్వహించిన సమర భేరీ సభ కంటే ముందు రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను భారీ ఎత్తున నిర్వహించింది. కేవలం ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుండే దాదాపు ఐదు వేల భారీ కార్ల ర్యాలీతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వాగతం పలికారు అంటే ఆ సభ ఎంత విజయవంతం అయిందో వేరేగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మూడు ప్రధాన ప్రశ్నలను సంధిస్తూ ఈ ఎన్నిక కేవలం ఒక ఉప ఎన్నిక కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఉప ఎన్నిక. మునుగోడు ప్రజలు ఎవరి వైపు ఉంటారు.. మోటర్లు పెడతామన్న బీజేపీ వైపా.. మోటర్లు పెట్టం అని అంటున్న టీఆర్ఎస్ వైపా అంటూ గ్యాస్ సిలిండర్ ధరలు. పెట్రో డిజిల్ ధరలు.. వ్యవసాయ బాయిల కాడ మోటర్లు పెట్టడం గురించి బీజేపీకి ప్రశ్నాస్త్రాలను సంధిస్తూ సమాధానాలు చెప్పాలని ఇటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ.. అటు ఆ తర్వాత రోజు మునుగోడు రానున్న కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. 

ఆ తర్వాత రోజు మునుగోడు వేదికగా జరిగిన బీజేపీ సమరభేరీ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఎప్పుడు మాట్లాడిన విధంగానే కుటుంబపాలన.. మజ్లీస్ మంత్రం.. రజకార్లు.. అవినీతి..జైలు ఇదే అంశాల గురించి పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అన్నట్లు ప్రసంగించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన మూడు ప్రశ్నలకు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండో ప్రశ్న అయిన మోటర్ల గురించి మాట్లాడి బోర్లాబొక్కలా పడటమే కాకుండా మూడో ప్రశ్న మాకు సంబంధం లేదనే ఉద్ధేశ్యంతో దాన్ని టచ్ చేయకుండా మునుగోడు ప్రజల మదిలో ప్రశ్నలు లెవనెత్తే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా కేసీఆర్ ప్రశ్నలను దాటవేశారు. అమిత్ షా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ గెలిస్తే వ్యవసాయ బాయిల కాడ మోటర్లు వస్తాయని చెప్పారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అక్కడ  వ్యవసాయ బాయిల కాడ మోటర్లు వచ్చాయా..?.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అక్కడ వచ్చాయా అని మునుగోడు నియోజకవర్గ ప్రజలను ప్రశ్నించానని చాలా తెలివిని ప్రదర్శించానని .. తన అపర చాణిక్యాన్ని బయట పెట్టుకున్నానని అమిత్ షా అనుకున్నాడు..

అయితే ఇక్కడే అమిత్ షా పప్పులో కాలేశాడు.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ  ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా  అక్కడ జరిగిన రెండు మూడు ఉప ఎన్నికల్లో గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నాము కాబట్టి తమ విధానాలను ఆ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీని కాదని మరి అమలు చేస్తాయా.. చేయవు అనే కనీసం సోయి లేకుండా అలా మాట్లాడి మునుగోడు ప్రజల మదిలోనే కాదు ఏకంగా యావత్ తెలంగాణ సమాజంలోనే ఓ ఆలోచనను రేకెత్తించాడు. ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి వ్యవసాయ బాయిల కాడ విద్యుత్ మోటర్లు పెట్టడం సాధ్యపడలేదు. ఎందుకంటే తన కంఠంలో ప్రాణమున్నంతవరకు.. తాను అధికారంలో ఉన్నంతవరకు చావనైన చస్తాను కానీ రైతన్నలను బాధపెట్టే వ్యవసాయ బాయిల కాడ విద్యుత్ మోటర్లు పెట్టను అని తేల్చి చెబుతూ అడ్డుగోడలా నిలబడుతున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ . ఒకవేళ తర్వాత తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా విద్యుత్ మోటర్లు పెట్టి తీరతామనే సందేశాన్ని పంపించారు అమిత్ షా.

ఇక రెండోది పెట్రో డీజిల్ ధరల గురించి మాట్లాడుతూ కేంద్రం రెండు సార్లు తగ్గించిన కానీ కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదు అని సమాధానం చెప్పిన కానీ మూడో ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా దాటవేశారు. అదే గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు. ఎంత సేపు ఇక్కడ బీజేపీ పార్టీ శ్రేణులు గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుకు కారణం కేసీఆర్ ప్రభుత్వమే కారణమని చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర మంత్రి అమిత్ షానే స్వయంగానే తిప్పికొట్టారు. ఎలా అంటే ఒకవేళ గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమైతే పెట్రో డీజిల్ ధరల పెంపుపై మాట్లాడినట్లే మాట్లాడేవారు. అలా మాట్లాడలేదంటే గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుకు అసలు కారణం తామే అని స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒప్పుకున్నట్లు అయింది. అమిత్ షా చెప్పిన చెప్పకపోయిన గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు కేంద్ర ప్రభుత్వాధీనంలోనే ఉంటుందని కనీస రాజకీయ విషయ పరిజ్ఞానం ఉన్న ఏ పోరడైన చెప్తాడు అని అమిత్ షా కూడా తెలుసు. అందుకే ఆ నెపాన్ని కేసీఆర్ పై వేయలేదు.

ఈ విధంగా ఇటు రాజకీయంగా అటు ఉద్యమాల ఫరంగా ఎంతో చైతన్యవంతమైన నల్లగొండ జిల్లా ముఖ్యంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సమర భేరీ సభ సాక్షిగా టీఆర్ఎస్ చేస్తున్న విమర్షలపై సమాధానాలు చెప్పకుండా  తమకు తామే సెల్ఫ్ గోల్ వేసుకుని రాజగోపాల్ రెడ్డికి పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడకుండా ఈ ఉప ఎన్నిక కేవలం కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీల మధ్యనే జరిగే విధంగా ఈ నియోజకవర్గ ప్రజల మదిలో చైతన్యాన్ని తీసుకోచ్చారు కేంద్ర మంత్రి అమిత్ షా . ఇప్పటికే ఇక్కడ ఉన్న బీజేపోళ్లు రోజురోజుకు అసత్య ప్రచారాన్ని నమ్ముకుని లేనిది ఉన్నట్లు .. ఉన్నది లేనట్లు చెబుతూ తమ ఇజ్జత్ తామే తీసుకుంటున్న ఈ తరుణంలో మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగం ఎక్కడోకచోట ఉన్న ఆ బీజేపీ పునాదులను సైతం కదిలించి తెలంగాణ సమాజం సిద్ధమవ్వడానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలు నాంది పలికేలా ఉన్నట్లు కన్పిస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat