ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్లో సోమవారం వేకువజామున ఘోరం జరిగింది. స్టేషన్ ఫ్టాట్ఫారంలోని ఓ బల్లపై పిల్లలతో కలిసి నిద్రిస్తున్న ఓ మహిళను లేపి మాట్లాడుతూ.. ఎదురుగా వస్తున్న అవధ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కిందకి తోసేశాడు ఓ వ్యక్తి. అనంతరం పరుగున వచ్చి నిద్రిస్తున్న పిల్లల్ని లాక్కొని తీసుకెళ్తు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
ఆదివారం మధ్యాహ్నం నుంచి మహిళ, ఇద్దరు పిల్లలు, నిందితుడు రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన మొత్తం స్టేషన్లోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. అక్కడి నుంచి పరారైన వ్యక్తి భీవండిలో పోలీసులకు దొరికిపోయాడు. నిందుతుడు మృతురాలి భార్య అవ్వొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.