కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. నందమూరి అందగాడు జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నోవాటెల్ లో భేటీ అయిన సంగతి విదితమే. అయితే ఈ భేటీ కేవలం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాత్రమే జరిగిందని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు కానీ దాని వెనక వేరే కారణాలు ఉన్నాయని ఇటు సినీ అటు పొలిటికల్ క్రిటిక్స్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ పై సినిమా తీయమని బీజేపీ అధిష్టానం కోరిందని. అందుకే సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని ఆయన వెల్లడించిన సంగతి విదితమే..
ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ను నటించమని కోరడానికి అమిత్ షా కలిశారు అని సినీ క్రిటిక్స్ .. లేదు కోమురం భీమ్ తెలంగాణ వాడు కాబట్టి ఆ పాత్రలో నటించినందుకు ఎన్టీఆర్ ను అభినందించడమే కాకుండా భవిష్యత్తులో రాజకీయం కోసం వాడుకోవాలని కలిశారని పొలిటికల్ క్రిటిక్స్ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది కదా వీరిద్దరి భేటీ ఎందుకు జరిగిందో కదా…చూడాలి మరి..?