తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ది సపరేట్ రూట్.. ఫ్యామిలీ మూవీస్ అయిన లవ్ మూవీస్ అయిన మాస్ మూవీస్ అయిన వీటిలో ఫలనా హీరోలకు మాత్రమే ఏదోకటి జానర్ సూటవుతుంది.తప్పా మూడు జానర్లు ఒకే పాత్రలో చేయగల్గే హీరోలు టాలీవుడ్ లో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు నవతరంలో జూనియర్ ఎన్టీఆర్. ఒక పక్క మాస్ మరోపక్క క్లాస్ ఇలా అన్నింటిలోనూ తనదైన శైలీలో నటించి జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. శ్రియా,ఆలియాభట్,అజయ్ దేవగన్ ,సముద్రఖని ,రాజీవ్ కనకాల తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ఆర్ఆర్ఆర్ . అయితే ఈ మూవీ విడుదల సమయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కోమురంభీం పాత్రలో కొన్ని సీన్స్ అవమానపరిచేలా ఉన్నయని.. టీజర్ చివరలో పోషించిన ముస్లిం టోపీని పెట్టుకుని కనిపించడం గిరిజన పుత్రుడైన కొమురం భీమ్‌కి టోపీ పెట్టడమేంటని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు సినిమాను బ్యాన్ చేస్తాం.. రీల్స్ తగులబెడతాం అని వార్నింగ్ ఇవ్వడంతో అప్పట్లో ఈ ఇష్యూ రచ్చ రచ్చ అయింది.
అయితే ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించడం అన్ని జరిగిపోయాయి. తాజాగా నిన్న ఆదివారం మునుగోడులో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటన తర్వాత హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో రాజకీయ సినీ విషయాల గురించి చర్చించుకోవడమే కాకుండా ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ పోషించిన కోమురం భీమ్ పాత్ర బాగుందని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఏముందని అనుకుంటున్నారా.. అక్కడకే వస్తాం. అసలు విషయం ఏంటంటే నోవాటెల్ లో అమిత్ షాను కలవడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఎదురు వెళ్ళి మరి ఘన స్వాగతం పలికి లోపలకు ఆహ్వనించాడు. అప్పుడు తిట్టిన నోటితోనే ఇప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పడమే కాకుండా ఆర్ఆర్ఆర్ మూవీ బాగుందని మెచ్చుకోవడం నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునేవార్తనే కదా.. ఏమంటారు..?