కోతులు చేసే అల్లరి ఇంతాఅంతా కాదు. ఆడుకునే వస్తువుల నుంచి చేతిలోని సంచుల వరకు వేటినీ వదల కుండా ఎత్తుకెళ్తుంటాయి. వాటి చేష్టలతో నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ కోతి ఏకంగా కలెక్టర్‌నే ఆటపట్టించింది. అంతేకాకుండా అక్కడున్న అధికారులతో బతిమాలించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా కలెక్టర్ నవ్‌నీత్ చాహల్ ఉన్నాతాధికారులతో కలిసి బృందావన్ ప్రాంతంలో పర్యటించారు. ఆ ప్రాంతంలో కోతులు అధికంగా ఉండడంతో కలెక్టర్‌కు ఓ వింత అనుభవం చోటుచేసుకుంది. కలెక్టర్ దగ్గరకు ఓ కోతి వచ్చి ఆయన పెట్టుకున్న కళ్లద్దాలను తీసుకెళ్లి దగ్గర్లో ఉన్న ఇనప చువ్వలపై కూర్చొండిపోయింది. అక్కడే ఉన్న పోలీసులు, అధికారులు, ప్రజలు గ్లాసెస్‌ను ఇవ్వాలని కోతిని బుజ్జగించడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత కోతి వాటిని తిరిగి ఇచ్చింది. సుసంత నందా అనే ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.