తెలంగాణలో త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరభేరీలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయపు జెండా కప్పుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించిన అమిత్ షా సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకున్నారు. అంతకుముందు ప్రముఖ వార్త పత్రిక ఈనాడు సంస్థల అధినేత.. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నోవాటెల్ లో సమావేశమయ్యారు.
అయితే ఇక్కడదాక అంత మంచిగానే ఉంది. అయితే హైదరాబాద్ లోకి ఎంట్రీచ్చినాక కేంద్ర మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత ఆలయం బయటకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్వయంగా ముందుకు ఉరికొచ్చి మరి షూస్ ను తన స్వహస్తాలతో అమిత్ షాకు అందించడం.. ఆయన వాటిని ధరించుకోవడం చకచక జరిగిపోయింది.అయితే ఈ ఘటనపై బీజేపీ పార్టీ శ్రేనులు ఒకలా.. ఇతర పార్టీలకు చెందిన వారు మరోకలా సమర్ధనలు.. వ్యతిరేకంగా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ కేంద్ర మంత్రి అమిత్ షాకు బండి సంజయ్ స్వయంగా షూస్ అందించడం త్వరలో తనకు పదవి గండం ఉంది. ఆ పదవి ఊడిపోతుందని.. దాన్ని నిలబెట్టుకునేందుకే అందించాడు అని పొలిటికల్ కారిడార్ లో గుసగుసలు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడమే కాకుండా ఆ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ వల్ల తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవీ ఊడటం ఖాయం.
అందుకు ఈటలకు ఇక్కడ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫుల్ సపోర్టు ఉండటం.. ఇవన్నీ కలగల్సి పార్టీలో తనకు ఎవరు మద్ధతు ఇవ్వకపోవడం వల్లనే ఇలా అమిత్ షా ను ప్రసన్నం చేసుకోవడం కోసం తానోక ప్రజాప్రతినిధి అన్న సంగతి.. రాష్ట్ర అధ్యక్షుడ్ని అనే సంగతి మరిచిపోయి కాదు పక్కనెట్టి మరి ఇలా చేశాడు అని పొలిటికల్ క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైన బండి సంజయ్ ఇలా చేయడం ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే. తెలంగాణను వీళ్ల చేతుల్లో పెడితే ఈ నేలను ఢిల్లీ వాళ్లకు అప్పజెప్పి బతుకులు ఆగం చేస్తారని టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైన బండి సంజయ్ షూస్ అందించడం తన పదవిని కాపాడుకోవడం కోసమే అన్నమాట.. ఉన్నమాట..