Home / NATIONAL / కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

దాదాపు నూట ముప్పై ఏడేండ్లు ఉన్న పార్టీ… స్వతంత్ర భారతాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన ఏకైక పార్టీ … ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరీ దిగజారిపోతుంది.

ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ .. కేంద్ర మాజీ మంత్రి.. సీనియర్ నేత ఆనంద్ శర్మ ఆ పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీకి రాశారు.

రాష్ట్రంలో జరిగే పార్టీ సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదు. పార్టీలో సీనియర్ అయిన తనకు అడుగడుగున అవమానం ఎదురవుతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విషయంలోనూ తనను సంప్రదించడంలేదు ఆ ఫలితంగా తన ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat