కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటనలో భాగంగా ప్రముఖ మీడియా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తో నిన్న ఆదివారం భేటీ అయ్యారు. ఆదివారం మునుగోడులో జరిగిన సభ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా రామోజీ రావుతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఇదే ఏడాది డిసెంబర్ నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా వర్తమాన భవిష్యత్ తాజా రాజకీయ పరిస్థితుల గురించి సుధీర్ఘంగా చర్చించినట్లు బీజేపీ శ్రేణుల టాక్.
అంతే కాకుండా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి నెగిటీవ్ వార్తలను హైలెట్ చేయాలని.. బీజేపీకి సపోర్టు చేయాలని కోరినట్లు కూడా ఆ పార్టీలో గుసగుస. పైకి మర్యాదపూర్వకంగా కలిసినట్లు కలరింగ్ ఇచ్చిన కానీ తెలంగాణపై సరికొత్త కుట్రలకు తెరతీయడానికే కలిశారని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు.