పెళ్ళి చేసుకోబోతుంది కాబట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు క్యూట్ హాటెస్ట్ బ్యూటీ నిత్యామీనన్ గురించి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై ఈ బ్యూటీ క్లారిటీచ్చింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా కాలుకు చిన్న గాయం కావడంతోనే గత కొంతకాలంగా విశ్రాంతి తీస్కుంటున్నాను.
పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్ట్టే సినిమాలకు దూరంగా ఉంటున్నదనే పుకార్లు పుట్టించారని తన ఆవేదన వ్యక్తం చేసింది. తనపై సినిమా ఇండస్ట్రీ నిషేధం విధించిందనే తప్పుడు ప్రచారంపై కూడా ఈ క్యూట్ బ్యూటీ మండిపడింది. ‘నా పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.
భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తా. నన్ను పరిశ్రమ నుంచి బ్యాన్ చేశారనే తప్పుడు వార్తల్ని పుట్టించారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని నా కెరీర్ ఆరంభం నుంచి చూస్తూనే ఉన్నా. మన ఉన్నతిని ఓర్వలేని వాళ్లు ఇలాంటి వదంతులను వ్యాప్తి చేస్తారు. అనవసర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదు. ప్రస్తుతం నేను మంచి కథల కోసం అన్వేషిస్తున్నా’ అని నిత్యామీనన్ చెప్పింది.