వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బొటానికల్ గార్డెన్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.గతంలో న్యాయవివాదంలో ఉన్న బొటానికల్ గార్డెన్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించుకున్నాము..
ఇప్పుడు దానిని దేశంలోనే అద్భుతమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. బొటానికల్ గార్డెన్ వద్ద విజిటర్స్ కోసం ప్రత్యేకంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి, వాకింగ్ సిగ్నల్ ఏర్పాటు చేనున్నామని ఆయన వెల్లడించారు.