జార్ఖండ్ మాజీ విద్యాశాఖ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నీరా యాదవ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కొడెర్మాలోని ఆమె ఇంటి సమీపంలో దుండగుడు బాంబు పేల్చారు. అయితే ఎవ్వరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, నిందుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. అయితే అతని మతిస్థిమితం సరిగాలేదని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
