దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 11,539 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,43,39,429కి చేరాయి. ఇందులో 4,37,12,218 మంది బాధితులు కోలుకున్నారు..
5,27,332 మంది మరణించారు. మరో 99,879 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. జూన్ 30 తర్వాత యాక్టివ్ కేసులు లక్ష దిగువకు చేరడం ఇదే మొదటిసారి. కాగా, గత 24 గంటల్లో 43 మంది మృతిచెందగా, 12,783 మంది డిశ్చార్జీ అయ్యారు.మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.