ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం చేసిందో తెలుసా..
వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు కూడా సామ్ వీలు చూసుకొని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు అప్డేట్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ నెలరోజుల నుంచి సామ్ ఇన్‌స్టా, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా ఏ సోషల్ మీడియాలోనూ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు సెలబ్రిటీల బర్త్‌డేలకు విషెస్ చెప్తుంది తప్ప అభిమానులకు తన గురించి ఏ అప్డేట్ ఇవ్వడం లేదు. దీంతో అభిమానులు ‘‘డియర్ సామ్ మేడమ్.. ఎక్కడికి వెళ్లిపోయారు?’’, ‘‘సమంతకు ఏమైంది?’’, ‘‘సామ్.. ఎందుకని పోస్టులు పెట్టడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు.