ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు.
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఇలా చేశానని ఆంచల్ తెలిపాడు. ఈ కార్యక్రమానికి అక్కడి స్థానిక ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ హాజరయ్యారు. ఆంచల్ చేసిన ఈ పనికి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసలు కురిపించారు.
