ప్రముఖ ఐటీ సంస్థ విప్రో మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రావాల్సిన ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.
గత త్రైమాసికంలో సంస్థ లాభాలు తగ్గడం వల్ల ఉద్యోగుల వేరియబుల్ పే ను కంపెనీ నిలిపివేస్తున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లకొట్టాయి. దీనికి స్పందించిన సంస్థ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో వెనకడుగు వేయడం లేదని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని, జులై నుంచి ప్రమోషన్లు అమల్లోకి వస్తున్నాయని విప్రో తెలిపింది. ఈ కంపెనీ ప్రతి 3 నెలలకొసారి ఉద్యోగులకు వేరియబుల్ పే చెల్లిస్తుంటుంది. అయితే వేతనాల పెంపుపై క్లారిటీ ఇచ్చిన సంస్థ.. వేరియబుల్ పే చెల్లింపు మొత్తంపై మాత్రం తాము ఎలాంటి ప్రకటన చేయలేమని సమాధానమిచ్చింది.