టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు.
ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని పేర్కొన్నాడు. సంధి కాలంలో జట్టును ధోనీ అద్భుతంగా నడిపించాడని.. టీమిండియాకే కాదు తన ఫ్రాంచైజీకి అతడు అసాధారణ విజయాలు అందించాడన్నాడు.