సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్దుకునేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 8 యూట్యూబ్ ఛానెల్స్‌ను బ్లాక్ చేసింది. ఇందులో 7 ఇండియాకు చెందినవి కాగా, 1 పాకిస్థాన్‌కు చెందినది. ఈ ఛానెళ్లను 85 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇవి అప్‌లోడ్ చేసే వీడియోస్‌ను 114 కోట్ల మంది చూశారు.
ఇలాంటి వీడియోస్ అప్‌లోడింగ్..
భారత సాయుధ బలగాలు, జమ్మూకశ్మీర్‌కు వ్యతిరేకంగా ఈ ఛానళ్లు పలు నకిలీ వార్తలను ప్రసారం చేశాయి. అంతే కాకుండా దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు, దేశంలో కొన్ని వర్గాల మధ్య ద్వేషం పెంచేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నందుకు ఈ ఛానళ్లను బ్లాక్ చేశామని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.