యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతిని ముగ్గురు యువకులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్కడ ఆమెకు మత్తు కలిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్యక్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ తర్వాత వాళ్లు రేప్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు చెప్పారు.
కొంత సేపటికి మత్తు నుంచి తేరుకున్న ఆ అమ్మాయి వారిని ప్రతిఘటించింది. అయితే ఆ సమయంలో ఆ యువతిని ఆ ముగ్గురు యువకులు బెదిరించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. అక్కడ నుంచి ఆ ముగ్గురు యువకులు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ యువతి ఇంటికి వెళ్లి తన ఫ్యామిలీకి జరిగిన విషయాన్ని చెప్పింది. తండ్రితో కలిసి ఆ యువతి మోదీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆ యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. నిందితుల్ని శేఖర్, కృష్ణ, అర్జున్‌గా గుర్తించారు. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు.