రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)పై త్వరలో సినిమాతో పాటు వెబ్ సిరీస్ తీస్తానని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు RSSపై తనకున్న భావన వేరని అన్నారు. RSSపై చిత్రం తీసేందుకు కథను అందించాల్సిందిగా కోరడంతో నాగ్ పూర్ వెళ్లానని.. అక్కడ సంస్థ గురించి వాస్తవాలు తెలుసుకున్నాక తన అభిప్రాయం తప్పని తెలుసుకున్నట్లు చెప్పారు.
