తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ సభ్యత్వానికి.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఇదే ఏడాదిలో ఉప ఎన్నికలు రానున్న సంగతి విదితమే.
అయితే ఈ ఉప ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను తమకు మద్ధతు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి అదేశాలతో ఆ పార్టీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్,మల్లు రవి,వేం నరేందర్ రెడ్డి కోరారు. దీనిపై కోదండరాం స్పందిస్తూ తమకు కొంత సమయం కావాలి. పార్టీలో అంతర్గతంగా చర్చించి వారం నుండి పదిరోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తుంది.