దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,813 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,040 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 4.15 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 208.31 కోట్ల కోవిడ్ డోసుల పంపిణీ జరిగింది.
