ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.
