రాష్ట్రంలో నేడు ఎంసెట్ ఫలితాలను ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. జులై నెలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జేఎన్‌టీయూలో ఈ రిజల్స్ విడుదల చేశారు.
ఇంజనీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి ఫస్ట్ ర్యాంక్, సాయిదీపికకు సెకండ్ ర్యాంక్, కార్తికేయకు థర్డ్ ర్యాంక్ వచ్చాయి. అగ్రికల్చర్ విభాగంలో నేహాకు ఫస్ట్ ర్యాంక్, రోహిత్‌కు సెకండ్ ర్యాంక్, తరుణ్‌కుమార్‌కు థర్డ్ ర్యాంక్‌లు వచ్చాయి.
