ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో వెండితెరకు పరిచయమైన కొణిదెల హీరో పవన్‌తేజ్ నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన మేఘనతో పవన్‌తేజ్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు పవన్‌తేజ్.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ సతీమణి సురేఖ, సాయిధరమ్ తేజ్, రాజీవ్ కనకాల, సుమ, డైరెక్టర్ మెహర్ రమేశ్ తదితరులు హాజరయ్యారు. ” నిశ్చితార్థం జరిగింది. ప్రేమతో మా ప్రయాణం ప్రారంభమైంది. తన వల్లే నాకు అసలైన ప్రేమకు అర్థం తెలిసింది. ఈ ఎంగేజ్‌మెంట్‌కు వేడుకకు వచ్చి మా జంటను ఆశీర్వదించిన చిన్నమ్మ సురేఖకు థ్యాంక్స్. ” అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు పవన్‌తేజ్.