ప్రతీ ఏడాది చెల్లి/అక్క రాఖీ కడితే డబ్బులో లేక కొత్త బట్టలో బహుమతిగా ఇస్తుంటారు కదా. ఈ సారి అలాకాకుండా కొంచెం కొత్తగా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా. ఇంకేందుకు ఆలస్యం ఈ గిఫ్ట్ ఐడియాలపై ఓ లుక్కేయండి..
* ఈ సారి మీ సోదరికి ఓ మంచి స్మార్ట్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె చాలా సంతోషిస్తుంది.
* కాఫీ కప్‌పై అందంగా మీరు మీ సోదరి తీసుకున్న ఫోటోను ప్రింట్ చేయించి ఇవ్వొచ్చు.
* అందమైన గాజులను ఇవ్వండి
* ఆమెను షాపింగ్‌కి తీసుకెళ్లి నచ్చింది కొనుక్కోమనండి
* ఓ మంచి హోటల్‌కి భోజనానికి తీసుకెళ్లి తన ఫేవరేట్ ఫుడ్ తినిపించండి.
* మీ చిన్ననాటి ఫోటోలన్నీ కలిపి ఓ మంచి ఫ్రేమ్‌లో పెట్టించి ఇవ్వండి.
* హ్యాండ్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి
* తన ఫేవరేట్ చాకోలేట్స్, స్వీట్స్ గిఫ్ట్‌గా ప్యాక్ చేసి ఇవ్వండి
* మేకప్ వస్తువులు ఇవ్వండి
* ఆమెకు పాటలు వినే అలవాటు ఉంటే మంచి హెడ్ ఫోన్స్ ఇవ్వండి
* కొందరికి మొక్కలు అంటే చాలా ఇష్టం అలాంటివారికి మొక్కల్ని ఇవ్వండి
* పెర్ప్యూమ్, బుక్స్, మొబైల్స్ కూడా ఇవ్వొచ్చు.