భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లో మంత్రి ఫ్రీడం రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు అక్కడ నుంచి ఫ్రీడం రన్ ని మంత్రి ప్రారంభించి తాను కూడా జిల్లా పరిషత్ పాఠశాల వరకు ఆ ఫ్రీడం రన్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పి పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
స్వాతంత్ర్యానికి ప్రత్యేకగా గాల్లోకి బెలూన్లను వదిలారు.అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి భారత జాతీయ ఉద్యమమే ప్రేరణ. ఆనాటి ఆ ఉద్యమ స్ఫూర్తితోనే నాటి తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. సాధించిన తెలంగాణ తెర్లు కాకుండా అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాంధీజీ స్ఫూర్తితోనే అమలు చేస్తున్నారు. అని మంత్రి అన్నారు.గాంధీజీ ఆశయాలకు అనుగుణంగానే గ్రామీణ భారతంలోనే దేశ అభివృద్ధి ఉందని భావించి, సీఎం కేసీఆర్ గారు, గ్రామాలను పల్లె ప్రగతి వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అద్భుతంగా అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి తెలిపారు. దేశంలో 20 అత్యున్నత ఆదర్శ గ్రామాలను లెక్క తీస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణవే రావడమే ఇందుకు నిదర్శనమని మంత్రి అన్నారు.
భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. నేటి యువత నాటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అలాగే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా ఆదర్శంగా తీసుకోవాలని శాంతియుత ప్రజాస్వామ్యత పద్ధతుల్లోనే దేన్నైనా సాధించవచ్చునని ఆ రెండు ఉద్యమాలు ప్రజలకు చాటి చెప్పాయని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని శాంతియుత మార్గంలోనే దేన్నైనా సాధించవచ్చునని మంత్రి చెప్పారు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి, సుఖశాంతులతో జీవించే విధంగా ప్రజా రంజకంగా పరిపాలన ఉండాలన్న దానికి సీఎం కేసీఆర్ గారి పాలనే నిదర్శనం అని మంత్రి చెప్పారు. తెలంగాణ గాంధీజీగా పేరున్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని, ఆచరణను ఆదర్శంగా తీసుకొని నేటి యువత భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు ప్రత్యేకించి యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.