సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది.
ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్రీకరణలో గ్లాస్ పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం జరిగిందట. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.