తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న.. అయితే తనను డార్లింగ్ అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సంభోదించడంపై బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది.
దీనిపై రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. ‘నేనొక నటిని. మాములుగా అయితే మీరు నా మూవీల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే అడుగుతున్నారు. కానీ నా నోటితో నేను చెప్పేంతవరకు అలాంటి ఎఫైర్ వార్తలను సీరియస్గా తీసుకోవద్దు’ అంటూ సమాధానమిచ్చింది.